Sale!

మరో జీవితం

30.00

T.I.P. Series No. 347                   

ISBN : 978-93-81111-98-7

జీవితాలు ఒకటా రెండా? మనం మరణించిన తరువాత మళ్ళీ లేపబడతామా? అప్పుడు మరో జీవితం ప్రారంభమవుతుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. కొందరు మరో జీవితం లేదని తోసిపుచ్చుతారు. కొందరు మరో జీవితం ఉందని అంటారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం. ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘‘మరో జీవితం’’ పుస్తకం చదవాల్సిందే; ప్రస్తుతం మన ప్రాపంచిక జీవితం తాత్కాలికం. ఇది పరీక్షా కాలం. అసలైన జీవితం మరణించిన తరువాత ప్రారంభమవుతుంది. అదే శాశ్వతజీవితం. అంతం కాని హాయి జీవితం. మనం ఈ ప్రపంచంలో గడిపిన జీవితాన్ని బట్టి రాబోయే మరో జీవితంలో దాని ప్రతిఫలం దాగి ఉంది. ఇక్కడ జీవిత పరీక్షలో నెగ్గితో మరో జీవితంలో అనంత సంతోషాలు పొందవచ్చు. ప్రాపంచిక జీవిత పరీక్షలో విఫలమైతే తీవ్రమైన బాధను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దైవ శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. రాబోయే జీవితం ఎలా ఉంటుంది? ఈ ప్రపంచంలో ఎలాంటి పనులు చేయాలి. అక్కడ హాయిని అనుభవించాలంటే ఈ ప్రపంచంలో ఏం చేయాలి? అనే విషయాలు ఈ పుస్తకంలో మనకు తెలుస్తాయి.

పుస్తక రచయిత: డాక్టర్ సమీ ఉజ్జమా

అనువాదం : ముహమ్మద్ ముజాహిద్

పేజీలు: 72

 

Category: