మనిషీ! నీ పుట్టుక ఎంత అద్భుతం
₹20.00
మనం సమాచార విస్ఫోటనం యుగంలో జీవిస్తున్నాము, దీనిలో డేటా, వార్తలు ఎలాంటి సమాచారమైనా సాటిలైట్ల ద్వారా ప్రసారం చేయబడుతుంది. ఇందుకు ఏ అంశమూ అతీతం కాదు. గర్భం, ప్రసవం, శిశు సంరక్షణ మరియు తల్లిదండ్రుల అంశాలు మినహాయింపు కాదు. వివరణాత్మక గర్భధారణ పుస్తకాల నుండి 3D-యానిమేటెడ్ వీడియోల వరకు ఇప్పుడు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబోయే తల్లులకు గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించే వెబ్‌సైట్‌లకు, యూట్యూబ్ చానళ్లకు కొదువేలేదు. కాబోయే తల్లి తన శరీరంలో జరిగే ప్రతి మార్పు గురించి, పుట్టబోయే బిడ్డను స్కానింగ్ ద్వారా ముందే తెలుసుకుంటుంది. మానవుని సృష్టి ప్రక్రియను గురించి ఖుర్ఆన్ గ్రంథం ఎన్నో పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే వివరించింది. ఎలాంటి అల్ట్రాసౌండ్ యంత్రం ఉనికిలో లేని కాలంలోనే పిండం ఎదుగుదల వృద్ధి దశలను ఖుర్ఆన్ వివరిస్తుంది. మనిషి పుట్టుక గురించి, మనిషి జీవిత లక్ష్యం గురించి ఖుర్ఆన్ ఏమంటుందో తెలుసుకోవాలనుకునేవారికి ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది.
మూలం : ఖుర్ఆన్ అవగాహనం
పేజీలు : 20 T.I.P. Series No. 353