ఖుర్ఆన్ : జీవన కళ
₹36.00
T.I.P. Series No. 347
ISBN : 978-93-81111-98-7
ప్రపంచంలో ఎక్కువుగా విమర్శలకు గురయ్యే మతం ఏదీ అంటే ఎవరైనా ఇట్టే చెప్పగలరు. జాతీయ, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు రావాలంటే ఇస్లామ్ ను విమర్శిస్తే చాలు. పాశ్చాత్య మీడియా అయినా, దేశీయ మీడియా అయినా ఇస్లామ్ విమర్శకులను హీరోలుగా కీర్తిస్తుంది. ఇస్లామ్ ధర్మాన్ని విమర్శిస్తూ ఎన్నో పుస్తకాలు, సినిమాలు, డాక్యుమెంటరీలు, వ్యాసాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. ఇందులో ఎంతోమంది విమర్శించిన వాళ్లు వాస్తవాలను తెలుసుకుని ముస్లిములుగా మారినవాళ్లూ ఉన్నారు. సత్యాన్ని తెలుసుకుని పశ్చాత్తాపం చెంది ఇస్లామ్ ను కీర్తిస్తూ పుస్తకాలు రాసిన వాళ్లూ చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో స్వామి లక్ష్మీ శంకరాచార్య ఒకరు. ‘ఖుర్ఆన్ జీనే క కళ’, ‘ఇస్లామ్ ఆతంక్ వాద్ యా ఆదర్శ్ వాద్’ హిందీలో రాసిన ఈ రెండు పుస్తకాలూ ఎంతో ఆదరణ పొందాయి. ఈ రెండు పుస్తకాలను తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు ప్రచురించింది. ‘ఖుర్ఆన్ : జీవన కళ’ పుస్తకం ఇటీవలె ప్రచురితమైంది.
హిందీ మూలం : స్వామి లక్ష్మీ శంకరాచార్య
అనువాదం : శ్రీమతి రేవూరి ప్రశాంతి మూర్తి
పేజీలు : 72