December 16, 2024

జమాఅతె ఇస్లామీహింద్ ప్రతినిధుల సమావేశంలో తీర్మానాలు

జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులు సయ్యద్ సాదతుల్లాహుసైనీ

ఇటీవలె జమాఅతె ఇస్లామీహింద్ కేంద్ర  ప్రతినిధి వర్గ సమావేశం జరిగింది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. ఈ మేరకు కొన్ని తీర్మానాలు చేశారు.

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం

దేశంలో మానవ విలువలు శరవేగంగా క్షీణిస్తున్నాయని, పాలకులు చర్చలు జరపకుండానే మూజువాణి ఓటుతో ఏకపక్షంగా చట్టాలు చేస్తున్నారని జమాఅతె ఇస్లామీహింద్ కేంద్ర ప్రతినిధుల సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలె ఢిల్లీలో జమాఅతె ఇస్లామీహింద్ కేంద్ర ప్రతినిధుల సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చించారు. స్వయంపతిపత్తిగల రాజ్యాంగ సంస్థలైన ఎలక్షన్ కమిషన్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ పె

రిగిపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాపై విశ్వసనీయత లేకుండా పోతోంది. మీడియా ప్రభుత్వానికి ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ‘నకలీ ఎన్ కౌంటర్లు, లాకప్ డెత్ లు, కఠిన నేరాల్లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్నవారి విడుదల, మతవిద్వేషాలను రెచ్చగొట్టడం, బహిరంగ బెదిరింపులు, లాంటి విషయాలు సమాజంలో అలజడి రేపుతున్నాయి’ అని సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

అవినీతి నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి

దేశంలో పెరుగుతున్న అవినీతిపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 95శాతం  ఆర్థిక నేరాలు పెరిగాయని ఒక సర్వేలో తేలింది. నైతిక పతనం, జవాబుదారీతనం లేకపోవడమే అవినీతికి మూలకారణమని,  అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పెరుగుతున్న విద్వేష, వైషమ్యాలు..

దేశంలో మత విద్వేషం పెరగడం వల్ల జమాఅతె ఇస్లామీహింద్ ప్రతినిధుల సభ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. అధికారంలోకి రావాలంటే విద్వేషాలు రెచ్చగొట్టడం, విద్వేష ప్రసంగాలు చేయడమే మార్గమని పార్టీలు భావిస్తున్నాయి.ప్రజల్లో అభద్రతా భావాన్ని పెంచి తమ పబ్బం గడుపుకోవడం అత్యంత అమానుషమని సభ ఆవేదన వెలిబుచ్చింది.

స్వలింగ సంపర్కుల వివాహం

స్వలింగ సంపర్కుల వివాహానికి చట్ట బద్ధత కల్పించడాన్ని జెఐహెచ్ ప్రతినిధుల సభ తీవ్రంగా ఖండించింది. 2018లో ఆర్టికల్ 377ను రద్దు చేసి స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతించే వ్యవహారం విచారణలో ఉంది. ఇదొక అసహజ, అనైతికమైన కార్యం.

సౌదీ-ఈరాన్ ల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ

సౌదీ, ఈరాన్ దేశాల దౌత్య సంబంధాల పునరుద్ధరణను జమాఅత్ ప్రతినిధి బృందం స్వాగతించింది. ఇరు దేశాలకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ దేశాల మద్య నెలకొనే సంబంధం, సానుకూల మార్పు పశ్చిమ ఆసియాలోని ముస్లిం దేశాల నడుమ శాంతి, వాణిజ్య సంబంధాల మెరుగుదల, అర్థవంతమైన పరస్పర సహాయ సహకారాలకు, సౌభ్రాతృత్వానికి నాంది పలుకుతుందని వెల్లడించింది. సిరియా, యమన్ దేశాల మధ్య జరుగుతున్న రక్తపాతాన్ని ఆపడంలో సహాయకారి అవుతుంది. ఇరాక్, లెబనాన్ తదితర దేశాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారమవుతుంది.