December 15, 2024

ఒక ఫ్రెంచ్ రియాలిటీ టీవీ స్టార్, మోడల్ మెరైన్ ఎల్ హిమెర్ ఇస్లాంను స్వీకరించారు. నవంబర్ 2న సౌదీ అరేబియాలో తన నిర్ణయాన్ని ప్రకటించి,  గొప్ప సంతృప్తిని వ్యక్తం చేసినట్లు గల్ఫ్ టుడే నివేదించింది.

నివేదిక ప్రకారం, మెరైన్ చాలా నెలల క్రితం ఇస్లాం మతంలోకి మారారు, అయితే సౌదీ అరేబియాలోని ఒక మసీదులో ఆమె షహదత్ ఉచ్చరించే వరకు వార్తలను బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంది.

షహదత్ ఉచ్చారణకు సంబంధించిన వీడియోను మక్కాలోని పవిత్ర కాబా సమీపంలో హిజాబ్ ధరించి ఉన్న ఫోటోలను మెరైన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మెరైన్ ఇలా వ్రాశారు, “నేను కొన్ని నెలల క్రితం ఇస్లాంలోకి మారాను. దీనిని అభినందిస్తున్న లేదా కనీసం గౌరవించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.‘‘

ఆమె మరో పోస్ట్ లో  “ఇది నా జీవితంలో సంతోషకరమైన రోజు. ఈ క్షణంలో అనుభవించిన ఆనందం భావోద్వేగాల తీవ్రతను వ్యక్తీకరించడానికి బలమైన పదాలు లేవు.‘‘

మెరైన్ జూలై 1993లో దక్షిణ ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్‌లో జన్మించింది మరియు మొరాకో-ఈజిప్షియన్ సంతతికి చెందినది.