December 21, 2024


ఇస్లామిక్ ఎకనామిస్టు డాక్టర్ ముహమ్మద్ నజతుల్లా సిద్ధిఖీ శనివారం కన్నుమూశారు. ఇస్లామిక్ ఫైనాన్స్ మార్గదర్శకులలో ఒకరైన సిద్ధిఖీ, జమాత్-ఎ-ఇస్లామీ హింద్ కేంద్ర సలహా మండలి సభ్యులుగానూ సేవలందించారు. ఆయన అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో కాలేజీ విద్యను పూర్తిచేశారు. అదే యూనివర్శిటీలో ఎకనామిక్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సిద్దీఖీ రచనా రంగంలోనూ రాణించారు. ఆర్థిక శాస్త్రంపై ఎన్నో పరిశోదనాత్మక గ్రంథాలు రచించారు. 5 భాషల్లో 63 రచనలు చేశారు. అనేక రచనలు అరబిక్, పర్షియన్, టర్కిష్, ఇండోనేషియా, మలేషియన్, థాయ్ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయంటే ఆయన రచనలు ఎంతగా ప్రాచుర్యం పొందాయో అర్థం చేసుకోవచ్చు. ‘బ్యాంకింగ్ వితౌట్ ఇంట్రస్ట్’ 27 ఎడిషన్లలో 3 భాషలలో ప్రచురించబడింది. తన సుదీర్ఘ విద్యా జీవితంలో, అనేకమంది Ph.D విద్యార్థులకు గైడ్ గా పనిచేశారు. ప్రపంచంలోని నలుమూలల్లో ఆయన ఉపన్యాసాలిచ్చారు. ఇస్లామిక్ ఎకనామిక్స్ రంగంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకు కింగ్ ఫైసల్ అవార్డు లభించింది.